BREAKING
మిట్స్‌ వర్సిటీలో ఘనంగా భారత వైమానిక దళ దినోత్సవం రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికీ గాయాలు ఈనెల 12 నుండి బోయకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు టమోటా మార్కెట్ అభివృద్ధిలో కీలక సంస్కరణలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధత గ్యార్మీ మహోత్సవం(జెండా పండుగ) కార్యక్రమంలో పాల్గొన్న....... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గుజరాత్‌లో సబర్మతి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం తుది దశకు: 85 శాతానికి పైగా పనులు పూర్తి. మునగ ప్లాంటేషన్ పనులను పరిశీలించిన జెడ్పీ సీఈఓ బిసి సంక్షేమ గురుకుల పాఠశాలకు ఐదు సీలింగ్ ఫ్యాన్లు వితరణ పరిహారం ఇవ్వకుండా పనులెలా చేస్తారు? తాటిపూడి బాలికల గురుకుల కళాశాల సమస్యలను పరిష్కరించాలి అక్టోబర్ 11 నుండి శతచండీ మహోరుద్ర యాగ మహోత్సవాలు మాజీ జెడ్పీటీసీ ఏడుకొండల కుటుంబానికి మంత్రి గొట్టిపాటి పరామర్శ సాగునీరు అందించాలి పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా 'గణిత దీప్తి' పుస్తకాల పంపిణీ

కార్యకర్తలకు అండగా ఉంటా - విక్కుర్తి

Select Suryaa Now
కార్యకర్తలకు అండగా ఉంటా - విక్కుర్తి


ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా

– తె.దే.పా నియోజకవర్గ ఇన్చార్జి విక్కుర్తి 

అవనిగడ్డ, మేజర్ న్యూస్: తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌చార్జ్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు అన్నారు. కార్యకర్తకు ఆపద వచ్చినప్పుడు వెన్నంటి ఉంటానని, పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తించి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం సాయంత్రం మల్ల పార్టీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.విక్కుర్తి మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను సహించబోనన్నారు. ఇతరులు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని శాశ్వత సమస్యలైన ఎదురు మొండి బ్రిడ్జి, ఔట్‌ఫాల్ సూయిజ్‌ల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఒక్క సీటు కూడా కోల్పోకుండా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.