BREAKING
తంబళ్లపల్లె సీనియర్ సిటిజన్స్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం మిట్స్‌ వర్సిటీలో ఘనంగా భారత వైమానిక దళ దినోత్సవం రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికీ గాయాలు ఈనెల 12 నుండి బోయకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు టమోటా మార్కెట్ అభివృద్ధిలో కీలక సంస్కరణలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధత గ్యార్మీ మహోత్సవం(జెండా పండుగ) కార్యక్రమంలో పాల్గొన్న....... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గుజరాత్‌లో సబర్మతి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం తుది దశకు: 85 శాతానికి పైగా పనులు పూర్తి. మునగ ప్లాంటేషన్ పనులను పరిశీలించిన జెడ్పీ సీఈఓ బిసి సంక్షేమ గురుకుల పాఠశాలకు ఐదు సీలింగ్ ఫ్యాన్లు వితరణ పరిహారం ఇవ్వకుండా పనులెలా చేస్తారు? తాటిపూడి బాలికల గురుకుల కళాశాల సమస్యలను పరిష్కరించాలి అక్టోబర్ 11 నుండి శతచండీ మహోరుద్ర యాగ మహోత్సవాలు మాజీ జెడ్పీటీసీ ఏడుకొండల కుటుంబానికి మంత్రి గొట్టిపాటి పరామర్శ సాగునీరు అందించాలి

ప్రజాస్వామ్య పరిరక్షణకు సమిష్టి పోరాటం, ఇండియా బ్లాక్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం

Select Suryaa Now
ప్రజాస్వామ్య పరిరక్షణకు సమిష్టి పోరాటం, ఇండియా బ్లాక్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం

నెల్లూరు, అర్బన్/క్రైమ్ (మేజర్ న్యూస్):
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు సంరక్షణ కోసం ఇండియా బ్లాక్‌ కూటమి ఆధ్వర్యంలో సమిష్టిగా ఉద్యమం చేపడతామని నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని, ఓటు చోరీకి వ్యతిరేకంగా అన్ని ప్రజాస్వామిక శక్తులను ఏకం చేసి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.నెల్లూరులోని ఇందిరా భవన్‌లో ఇండియా బ్లాక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాథమిక ఆధారమని, దాని పరిరక్షణ కోసం పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.సీపీఐ ప్రధాన కార్యదర్శి అరిగెల సాయి మాట్లాడుతూ ఓట్ల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలబెట్టేందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లకు సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు అవసరమన్నారు.      ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు.పౌరహక్కుల నాయకుడు, సీనియర్‌ న్యాయవాది బ్రహ్మం, జిల్లా కాంగ్రెస్‌ ఇన్‌చార్జి గోపాల్‌రెడ్డి, డాక్టర్‌ యశోదర, కే. సంజయ్‌కుమార్‌, న్యాయవాదులు సుధీర్‌, సుధాకర్‌, శివశంకర్‌, ఎస్‌డీపీఐ జిల్లా అధ్యక్షులు రఫీ, ఎం. భాస్కరయ్య, షాన్వాజ్‌, సుబ్బరాయుడు, సిరాజ్‌, బాల సుధాకర్‌, కొండా ప్రసాద్‌,డాక్టర్ ప్రసాద్, మళ్లీ కిషోర్ రెడ్డి, బుచ్చి కిషోర్, బద్రి, హాజీ హనీఫ్, రాజా సుజాత తదితరులు పాల్గొన్నారు