సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు
ఆమదాలవలస, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ తెలియజేశారు. ఆమదాలవలస పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ గదుల ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. కౌంటింగ్ గదుల వద్ద పటిష్టమైన బందోబస్తు, సీసీ కెమెరాలు నిఘా పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ ధనుంజయనాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రాము, సరుబుజ్జి, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.