BREAKING
జామ్‌నగర్ రిఫైనరీకి యూఎస్ విదేశాంగ మంత్రి: ఇంధన వ్యూహమే ప్రధాన లక్ష్యం! సౌదీ అరేబియా రక్షణకు బ్రిటన్ కీలక నిర్ణయం: రాయల్ ఎయిర్‌ఫోర్స్ టైఫూన్ యుద్ధ విమానాల మోహరింపు! ఫ్రాన్స్ హింసాత్మక అల్లర్లు: మరిన్ని నగరాల్లో కర్ఫ్యూ విధింపుపై ప్రధాని ప్రకటన ఇరాన్ పాలకుల పాలనను అంతమొందించడమే మా లక్ష్యం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు.. భారత్-అమెరికా బంధం: వాణిజ్యం, భద్రతపై జైశంకర్ ఉన్నత స్థాయి భేటీ ఫారమ్ 173A అంటే ఏమిటి?: ప్రభుత్వ సెక్యూరిటీలపై పన్ను మినహాయింపుల కోసం సీబీడీటీ కొత్త నిబంధనలు! MSCI హెచ్చరికలతో కుప్పకూలిన ఇండోనేషియా స్టాక్ మార్కెట్.. 2031 నాటికి హార్ముజ్ జలసంధి ప్రాధాన్యత కనుమరుగు: హెచ్‌ఎస్‌బీసీ సీఈవో పండుగల వేళ ఈ-కామర్స్ జోరు: ఫ్లిప్‌కార్ట్ యాక్టివ్ యూజర్లలో సరికొత్త రికార్డు.. బోఫా (BofA) నివేదికలో కీలక వెల్లడి! పండుగల వేళ అమెజాన్ బంపర్ రిక్రూట్‌మెంట్: 3 లక్షల మందికి పైగా నియామకాలు.. ఫ్యాక్టరీ ప్రమాదం దర్యాప్తులో షెఫ్లర్ ఇండియా సీఈవో హర్ష కదమ్‌ను అదుపులోకి తీసుకున్న పూణే పోలీసులు! నేటి పంచాంగం 21 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –21 అక్టోబర్ 2026 అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు

ఎల్‌నినోను ఎదుర్కొనే శక్తిని ప్రజా ప్రభుత్వానికి ప్రసాదించాలి.. అమ్మవారిని వేడుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
ఎల్‌నినోను ఎదుర్కొనే శక్తిని ప్రజా ప్రభుత్వానికి ప్రసాదించాలి.. అమ్మవారిని వేడుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ఎల్‌నినో వంటి ప్రకృతి సంబంధిత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే శక్తిని ప్రజా ప్రభుత్వానికి ప్రసాదించాలని దుర్గామాతను ప్రార్థించినట్లు తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం వికారాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విశ్వం పంతులు ఆహ్వానం మేరకు శివాజీనగర్ కాలనీలో నిర్వహించిన అమ్మవారి అఖండ హారతి పూజా కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. అనంతరం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కాలనీలో కౌన్సిలర్ మల్లికార్జున గౌడ్ ఆధ్వర్యంలో త్రిశూల్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేలా అమ్మవారు శక్తిని ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో వికారాబాద్ పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు సత్యనారాయణ, పుష్పలత, మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ చిగుర్లపల్లి రమేష్, కౌన్సిలర్లు లక్ష్మీకాంత్ రెడ్డి, రాఘవేందర్, స్థానిక కౌన్సిలర్ సుచరిత చరణ్ రెడ్డి, వికారాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, సామా ప్రభాకర్ రెడ్డి, డీఎస్పీ ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ నాయకులు చింటు, సతీష్ రెడ్డి, నిఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.