సైకత శిల్పంతో దసరా శుభాకాంక్షలు
ఆమదాలవలస, సూర్య : ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస గ్రామ సమీపంలో సంగమేశ్వర ఆలయం వద్ద సైకత శిల్పి గేదెల హరికృష్ణ వేసిన సైకత శిల్పం ఆకట్టుకుంటుంది. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ దుర్గాదేవి అమ్మవారి చిత్రపటాన్ని సోమవారం ఇసుకతో తీర్చిదిద్దాడు. దసరాతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ శిల్పాన్ని తీర్చిదిద్దినట్లు తెలియజేశాడు.
రిపోర్టర్ : రాము, సరుబుజ్జి, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.