సాఫ్ట్‌బాల్ పురుషులు, మహిళల ప్రాబబుల్స్ జట్ల ఎంపిక
శ్రీకాకుళం, సూర్య : శ్రీకాకుళంలోని కోడి రామమూర్తి స్టేడియంలో సీనియర్ సాఫ్ట్‌బాల్ పురుషులు, మహిళల ప్రాబబుల్స్ జట్లను ఎంపిక చేశారు. చిత్తూరు జిల్లాలోని చిత్తూరులో డిసెంబర్ 12 నుంచి 14 వరకు జరగనున్న టోర్నమెంట్‌లో ఈ జట్లు పాల్గొననున్నాయి. ఒక్కో జట్టుకు 25 మంది చొప్పున క్రీడాకారులను ఎంపిక చేశారు.
రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ సూర శ్రీనివాసరావు ఈ ఎంపికల ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కన్వీనర్ ఎం.వి. రమణ, వైస్ ప్రెసిడెంట్ ఎం. తిరుపతిరావు, సెలక్షన్ కన్వీనర్ ఏ. ఢిల్లీశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ఎం. ఆనంద్ కిరణ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు పి. రమేష్, జి. రాజశేఖర్, పి. రామరాజు, మోహన్, పెంటయ్య పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులకు త్వరలో శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. పురుషుల జట్టుకు కోటబొమ్మాళిలో, మహిళల జట్టుకు శ్రీకాకుళంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిక్షణ అనంతరం టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లను సిద్ధం చేయనున్నారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.