రుద్రంపేట టీడీపీ నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం నియోజకవర్గ పరిధిలోని రుద్రంపేట గ్రామ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమావేశమయ్యారు.
స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, పార్టీ నాయకుల సమన్వయం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల సమస్యలు తదితర అంశాలపై నాయకులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నాయకులకు పలు సూచనలు చేస్తూ, సమష్టిగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్