రోడ్డు ప్రమాదంలో అధికారికి గాయాలు
హొళగుంద, సూర్య ప్రతినిధి: కర్నూలు జిల్లా హొళగుంద, ఆదోని రోడ్డు మార్గంలో మోటార్ బైకు అదుపుతప్పి కుంటలో పడడంతో ఎమ్మిగనూరు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ మల్లికార్జున కు గాయాలయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిమిత్తం హొళగుంద కు వస్తున్న అధికారి ఈరన్న మలుపు వద్ద మోటార్ బైక్ అదుపుతప్పడంతో కుంటలు పడ్డాడు.దీంతో ఆయనకు ఎడమ చేయి విరగడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొంది మెరుగని చికిత్స కోసం పట్టణ ప్రాంతానికి వెళ్లారు.ఎన్నికల నిమిత్తం వస్తున్న అధికారికి గాయాలు కావడంవల్ల ఆయనకు ఆర్థిక సాయం చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిలర్ వై.ముత్తన్న ఎన్నికల కమిషనర్ ను కోరారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.