రేపల్లె పట్టణంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు
రేపల్లె మేజర్ న్యూస్; రేపల్లె పట్టణంలో ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకులు ఐఏఎస్ అధికారి ఏ ఎల్ ఎల్ పద్మావతి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి బి. శ్రీదేవి ఎన్నికల పరిశీలకులకు స్వాగతం పలికి, వారి వెంట పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రేపల్లె పట్టణంలోని స్ట్రాంగ్ రూమ్‌లు, నామినేషన్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఎన్నికల వ్యయ పరిశీలకులు రేపల్లె పట్టణంలోని కొన్ని నామినేషన్ కేంద్రాలతో పాటు మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, ఎన్నికల సంబంధిత ఏర్పాట్లను పరిశీలించారు.