BREAKING
కూటమినేతలంతా కలిసికట్టుగా ఉన్నాం... అపోహలు నమ్మద్దు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: మాజీ మంత్రి హరీశ్ రావు దసరా పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి : మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి విజయదశమి, దసరా సందర్భంగా సిద్దిపేట ప్రజలకు పూజల హరికృష్ణ శుభాకాంక్షలు రాజకీయ పార్టీల నాయకుల తో సమావేశం నిర్వహించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎం అభ్యర్థులకు మద్దతివ్వాలి ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కార్ పాలపిట్టను కాపాడుకుందాం.. ప్రకృతిని సంరక్షిద్దాం:జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌ఓ) విశాల్ బత్తుల, ఐఎఫ్‌ఎస్‌ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ సమక్షంలో 25 మంది వైసీపీ నాయకులు టిడిపిలో చేరిక.. అప్పాజీపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు దుర్గామాత విగ్రహాన్ని అందజేసిన ధనరాజ్ ముదిరాజ్ చల్లూరులో దుర్గామాతకు విప్ బీర్ల ప్రత్యేక పూజలు నగరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ సంపూర్ణ అక్షరాస్యతే ధ్యేయం మహిళల్లో చైతన్యం నింపిన ‘అక్షర రంగవల్లులు’ కార్యక్రమం ఘనంగా దుర్గా మాత హోమం

రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా : ఎస్ ఐ

Select Suryaa Now
రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా : ఎస్ ఐ

చీపురుపల్లి మేజర్ న్యూస్: 

పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ ఐ ఉమా వెంకటేశ్వరరావు తెలిపారు. రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచామన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిశితంగా గమనిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులు ఎంతటి వారైనా చట్టం ముందు బాధ్యత వహించాల్సిందేనని, నేరాలకు పాల్పడే వారు పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు,  అసాంఘిక కార్యకలాపాలను గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఆయన  కోరారు.

మధు, చీపురుపల్లి విజయనగరం జిల్లా