రాష్ట్ర వాలీబాల్ టీం కుందుర్పి విద్యార్థి ఎంపిక
*రాష్ట్రవాలీబాల్ టీంకు కుందుర్పి విద్యార్థి మనోజ్* ప్రభుత్వఉన్నత పాఠశాల విద్యార్థి మనోజ్ రాష్ట్ర వాలీబాల్ టీంకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపిచంద్ తెలిపారు. మండలకేంద్రానికి చెందిన కురుబ హనుమంతరాయుడు కుమారుడు మనోజ్ కుందుర్పి జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 8నఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలలో ఉత్తమప్రతిభ కనబరిచిన మనోజ్ రాష్ట్రస్థాయి అండర్-17 వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,గ్రామ పెద్దలతో మనోజ్ కు అభినందనలు తెలిపారు. రాబోవురోజులో జాతీయస్థాయిలో కూడా రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు క్రిష్ణమూర్తి,హనుమంతప్ప, సుబ్బరామప్ప, రామాంజినేయులు ,దామోదర్,అరుణ,గీతారాణి, నాగవేణి,రోచన పాణి, సూధామణి,రాజేశ్వరి భాగ్య లక్ష్మి,ఓబుళమ్మ,వీరేష్
పిడి.మంజునాథ, అనిల్ కుమార్, పెన్నోబళేషు, నాగేష్ బాబు, హనుమంతరాయుడు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. *రాజు సూర్య రిపోర్టర్ కుందుర్పి*