రాష్ట్ర కార్యదర్శి చావ్వ రాజశేఖర్ రెడ్డిని కలిసిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మున్సిపల్ ఎన్నికలపై సుదీర్ఘ చర్చ
అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగరపాలక సంస్థ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) చావ్వ రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు.ఈ భేటీలో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ తనకు ఆశీస్సులు అందించాలని, ఎన్నికల్లో విజయం సాధించేందుకు సహకరించి, పార్టీ విజయానికి తమ వంతు కృషి చేయాలని చావ్వ రాజశేఖర్ రెడ్డిని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, సీనియర్ నేతలను కలుస్తూ రమేష్ గౌడ్ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణుల సమన్వయం, ప్రజలతో మమేకం కావడం, నగర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.నగర అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని రమేష్ గౌడ్ పేర్కొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.