BREAKING
సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ క్యూ2 ఫలితాలు: రూ. 660 కోట్లకు పెరిగిన ఆదాయం, రూ. 81 కోట్ల నికర లాభం నమోదు రూ. 8,415 కోట్ల AT-1 బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ: గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్ కొత్త రేట్లు ఇవే నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

పుల్లేటికుర్రులో మతిస్థిమితం లేని వ్యక్తి చేతిలో వృద్ధుడి హత్య

Select Suryaa Now
పుల్లేటికుర్రులో మతిస్థిమితం లేని వ్యక్తి చేతిలో వృద్ధుడి హత్య

                               సంత మార్కెట్లో వెనుక నుండి కత్తితో దాడి.. ఘటన స్థలంలోనే మృతి

 -అంబాజీపేట మేజర్ న్యూస్ :అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామంలో శుక్రవారం ఉదయం దారుణ హత్య చోటుచేసుకుంది. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి దింపు కత్తితో దాడి చేయడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.గ్రామానికి చెందిన పిట్ల ప్రసాద్ (38) గత కొంతకాలంగా దింపులు తీస్తూ జీవనం సాగించేవాడు. అయితే గత కొన్ని రోజులుగా అతడు మతిస్థిమితం కోల్పోయి గ్రామంలో పిచ్చిగా తిరుగుతున్నాడు.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో గ్రామానికి చెందిన మామిడిశెట్టి సత్యనారాయణ (76) పై ప్రసాద్ ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. దింపులు తీసే కత్తితో వెనుక వైపు నుండి విచక్షణారహితంగా దాడి చేయడంతో సత్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఉదయాన్నే జరిగిన ఈ ఘటనతో పుల్లేటికుర్రు గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.సమాచారం అందుకున్న సీఐ భీమరాజు ,ఎస్ఐ సుభాని లు తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హత్య జరిగిన తీరును పరిశీలించి, స్థానికుల నుండి వివరాలు సేకరించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.