BREAKING
గౌరి లంకేష్ హత్య ప్రకాష్ రాజ్‌ను మానసికంగా కుంగదీసింది, ఆమె భార్య పోనీ వర్మ ఆవేదన ఓటు వేసిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో కొనసాగుతున్న ఎన్నికల పక్రియ. తన ఓటు హక్కును వినియోగించుకున్న రెడ్డి అప్పలనాయుడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి ని పరిశీలిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థుల పోరాటానికి ప్రకాష్ రాజ్ మద్దతు, సతీమణి భయానికి ఆయన ఇచ్చిన సంచలన సమాధానమిదే! ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలి. - ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ. ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 11/1! చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జన్మభూమిపై మమకారం.. పెద్ద ఉమెంతాల్ అభివృద్ధికి, క్రీడాకారులు, పేద విద్యార్థుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసిన పట్నం మహేందర్ రెడ్డి

ప్రేమకు నిరాకరించిందని దారుణం: జంగారెడ్డిగూడెంలో యువతిపై కత్తితో దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

Select Suryaa Now
ప్రేమకు నిరాకరించిందని దారుణం: జంగారెడ్డిగూడెంలో యువతిపై కత్తితో దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
జంగారెడ్డిగూడెం:
తనను దూరం పెట్టిందనే కక్షతో ఓ యువతిపై ఉన్మాదిలా మారి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘోర ఉదంతం ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది. జంగారెడ్డిగూడెం పరిధిలోని ఎస్సీపేటలో జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రిలో మరణించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:
ఎస్సీపేటకు చెందిన చీకటి స్వప్న (30), ఆమె సమీప బంధువైన సుంట్రు కృష్ణారెడ్డి గతంలో ప్రేమించుకున్నారు. అయితే, కొంతకాలంగా ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో కృష్ణారెడ్డిని స్వప్న దూరం పెడుతూ వస్తోంది. తనకు దూరంగా ఉంటుందనే కోపంతో కృష్ణారెడ్డి ఆమెపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం ఇంట్లో స్వప్న ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి కృష్ణారెడ్డి లోపలికి చొరబడ్డాడు. కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. స్వప్న కేకలు వేయడంతో స్థానికులు వచ్చేలోపే నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.
రక్తపు మడుగులో పడి ఉన్న స్వప్నను స్థానికులు, కుటుంబ సభ్యులు కలిసి వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో శనివారం ఆమె కన్నుమూసింది. ఈ ఘాతుకంపై జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడు కృష్ణారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.