ప్రముఖ ఆడిటర్ మురళిని కలిసిన వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్
అనంతపురం బ్యూరో ( అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ నగరంలోని రెండో రోడ్డులో నివాసం ఉంటున్న ప్రముఖ ఆడిటర్ మురళిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర రాజకీయ పరిణామాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
రమేష్ గౌడ్ తన నివాసానికి రావడంపై ఆడిటర్ మురళి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన రమేష్ గౌడ్‌కు తమ మద్దతు ఉంటుందని తెలియజేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
నగరంలోని ప్రముఖులు, వివిధ వర్గాల వ్యక్తులను కలుస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకోవడంలో భాగంగా రమేష్ గౌడ్ ఈ భేటీ నిర్వహించారు. మర్యాదపూర్వకంగా సాగిన ఈ సమావేశం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.