andhrapradesh
ప్రజలతో మమేకమవుతూ.. ప్రచారం ను కొనసాగించిన11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షాకీరా మౌలాలి
కదిరి పట్టణంలోని 11వ వార్డులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షాకిరా మౌలాలి ఎన్నికల ప్రచారం ఉత్సాహంతో కొనసాగుతోంది. మంగళవారం కౌన్సిలర్ అభ్యర్థి షాకీరా మౌలాలి ప్రచార కార్యక్రమాన్ని తనదైన శైలిని కొనసాగించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆశీస్సులతో ఎన్నికల బరిలో నిలిచానని, పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తూ ఓటర్ల ను కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. అలాగే వార్డు అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే ప్రధాన అంశాలుగా ప్రజల ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. *ప్రజలతో మమేకం*
ఎన్నికల ప్రచారంలో భాగంగా 11వ వార్డులోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలుకరిస్తూ, వారి సమ స్యలనుతెలుసుకుంటూ తన అభ్యర్థి త్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతు న్నారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి అవసరాలను తెలుసుకోవడం, స్థానిక సమస్యలపై స్పందించడం ద్వారా వార్డుతో తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో తనకు అవ కాశం కల్పించాలని, ప్రజలకు అందు బాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని వివరిస్తున్నారు. నవంబర్ 1న పోలింగ్ జరగనుందని, వార్డ్ కౌన్సిలర్ గా తనకు, చైర్మన్ అభ్యర్థి అర్షియా భాను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.