BREAKING
ఓటు వేసిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో కొనసాగుతున్న ఎన్నికల పక్రియ. తన ఓటు హక్కును వినియోగించుకున్న రెడ్డి అప్పలనాయుడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి ని పరిశీలిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థుల పోరాటానికి ప్రకాష్ రాజ్ మద్దతు, సతీమణి భయానికి ఆయన ఇచ్చిన సంచలన సమాధానమిదే! ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలి. - ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ. ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 11/1! చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జన్మభూమిపై మమకారం.. పెద్ద ఉమెంతాల్ అభివృద్ధికి, క్రీడాకారులు, పేద విద్యార్థుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసిన పట్నం మహేందర్ రెడ్డి భారత్‌కు తొలి షాక్.. ఒక పరుగుకే అభిషేక్ శర్మ అవుట్!

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎంపీ చిన్ని

Select Suryaa Now
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎంపీ చిన్ని

విజయవాడ, మేజర్ న్యూస్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడలోని లయోలా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎంపీ తన సతీమణి జానకీ లక్ష్మితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తన తల్లిని వీల్‌చైర్‌పై పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఆమెతో కూడా ఓటు వేయించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ నగరంలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, అధికారులు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. ముఖ్యంగా వృద్ధుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద వీల్‌చైర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వయోభారంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ పెద్దలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడం సంతోషకరమని పేర్కొన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతానికి సమానంగా ప్రస్తుత ఎన్నికల్లో కూడా పోలింగ్ నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. యువత సైతం ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకుండా ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని, సాయంత్రం 5 గంటలలోపు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు.

 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.