BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

ప్రజాసేవే మా లక్ష్యం - వారి ఆశీస్సులే మా బలం : షేక్ రుక్సార్ సుల్తానా

Select Suryaa Now
ప్రజాసేవే మా లక్ష్యం - వారి ఆశీస్సులే మా బలం : షేక్ రుక్సార్ సుల్తానా
 

 

మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 3వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థినిగా షేక్ ముహమ్మద్ హనీఫ్ భార్య షేక్ రుక్సార్ సుల్తానా నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా వార్డు ప్రజల ఆశీస్సులు,ఆదరాభిమానాలు కోరారు.తన నామినేషన్ ప్రక్రియ పూర్తిచేయడంలో సహకరించిన అధికారులందరికీ రుక్సార్ సుల్తానా కృతజ్ఞతలు తెలిపారు.అలాగే తనకు మద్దతుగా నిలుస్తున్న వార్డు ప్రజలకు,పెద్దలకు,పార్టీ నాయకులకు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.వార్డులో తాగునీరు,డ్రైనేజీ వ్యవస్థ,రహదారులు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తానని తెలిపారు.ప్రజల నుంచి తన దృష్టికి వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా,ప్రతి రోజూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటానని,ప్రజాసేవే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.వార్డు అభివృద్ధి కోసం తన స్థాయికి మించి కష్టపడతానని,ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం శ్రమిస్తానని తెలిపారు.ప్రజల ఆదరాభిమానాలు,పెద్దల ఆశీస్సులు,ప్రతి ఒక్కరి ప్రేమ తమ కుటుంబానికి ఎంతో విలువైనవని షేక్ ముహమ్మద్ హనీఫ్,షేక్ రుక్సార్ సుల్తానా పేర్కొన్నారు.3వ వార్డు అభివృద్ధి,ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.ఈ ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపి,ఆశీర్వదించాలని 3వ వార్డు ప్రజలను వారు మనస్ఫూర్తిగా కోరారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి