BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

ప్రజాసేవే లక్ష్యంగా 26వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా మెహనూర్ నామినేషన్

Select Suryaa Now
ప్రజాసేవే లక్ష్యంగా 26వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా మెహనూర్ నామినేషన్

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ :  ప్రొద్దుటూరే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే భావనతో 2005 నుండి 2026 వరకు నిరంతరం ప్రజలకు సేవ చేయడంలోనే నాకు పరిపూర్ణ సంతృప్తి లభించింది అని మాజీ కౌన్సిలర్ నూరి స్పష్టం చేశారు. ఆదివారం 26వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా తన తమ్ముని భార్య మెహనూర్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 26వ వార్డులోని నూరి కార్యాలయం నుండి కౌన్సిలర్ అభ్యర్థి మెహనూర్, మాజీ కౌన్సిలర్ నూరి, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి  బయలుదేరారు. మట్టి మసీదు వీధిలోని దర్గా వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నాయకులు, ప్రజల నడుమ నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు మున్సిపల్ ఆఫీసుకు వెళ్లారు.

అఖండ విజయాన్ని అందించాలి.

తమ కుటుంబ సేవా నిబద్ధతను గుర్తించి మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కి నూరి కృతజ్ఞతలు తెలిపారు. వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మెహనూర్ కు ఒక ఓటు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎమ్మెల్యే సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి కి ఒక ఓటు వేసి, ఇద్దరినీ అఖండ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను, అభిమానులను నూరి అభ్యర్థించారు.

  • షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా