ప్రజా సేవకుకు అంకితమైన మజ్జి గణపతి
వంగర, సూర్య : .విజయనగరం జిల్లా వంగర మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన మజ్జి గణపతి ప్రజా సంఘాల నుంచి ప్రజాసేవకు బాటలు వేస్తున్నారు.. వంగర మండల జడ్పీటీసీ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడంతో మాజీమంత్రి, రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ గణపతికి అభ్యర్థిగా ప్రకటించారు. టిడిపి రాజాం నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా , జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యుడిగా సేవలందిస్తున్న ఆయన, దళిత బహుజన సంఘాల జేఏసీ ఉత్తరాంధ్ర అధ్యక్షుడిగా నిరంతరం ప్రజల కోసం ప్రజా సమస్యల పట్ల గణపతి పనిచేస్తున్నాడు. పాఠశాల కళాశాలలో గణపతి నాయకత్వ లక్షణాలతో చురుగ్గా ఉండేవాడు. అనంతరం వామపక్ష భావజాలం పట్ల మక్కువ తో సిపిఎం పార్టీలో చేరి ఎస్ఎఫ్ఐ, సిఐటియు, కెవిపిఎస్ సంఘాల్లో జిల్లా నాయకుడిగా సేవలందించి సిపిఎం నాయకుడిగా సుమారు 25 ఏళ్లు పనిచేసి అనేక సమస్యలపై క్షేత్రస్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం సమస్యల పట్ల ప్రజా పోరాటాలు చేసి ప్రజల గొంతుకుగా ప్రజా నాయకుడిగా గణపతి గుర్తింపు పొందాడు. వంగర మండలం శ్రీహరిపురం గ్రామంలో సామాన్య దళిత కుటుంబంలో జన్మించిన ఆయన తల్లిదండ్రులు మజ్జి గురయ్య, తవుడమ్మలు. భార్య మజ్జి పార్వతి కుమార్తెలు జెన్నీ రాణి దీపికలు ఉన్నత చదువులు చదివారు.ఆ గ్రామంలో పంచాయతీ వార్డు మెంబర్ గా గెలుపొంది 15 ఏళ్లు సేవలందించాడు. ప్రస్తుతం వంగర మండల కేంద్రంలో నివాసం ఉంటున్నారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ మంత్రి రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పట్ల బడుగు బలహీన వర్గాలకోసం ప్రజాసేవతో పాటు విద్య వైద్య ఆరోగ్యానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ గొప్ప అభివృద్ధి ప్రదాతగా.బావితరాలకు భవిష్యత్తును ఇచ్చే గొప్ప ప్రజా నేతగా కోండ్రు మురళీమోహన్ మంచి దార్శనికత పట్ల ముఖ్యంగా రాజాం నియోజకవర్గం అభివృద్ధి . సంక్షేమాన్ని రాష్ట్రంలోనే ముందంజలో తీసుకు వెళ్తున్న అభివృద్ధి ప్రదాతగా మజ్జి గణపతి ఆకర్షితులై 10 ఏళ్ల క్రితం టిడిపి పార్టీలోకి చేరారు.వంగర మండల జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో లో మజ్జి గణపతి మాట్లాడుతూ కోండ్రు మురళీమోహన్ ఆశీస్సులతో తనకు జడ్పిటిసి గా పోటీ చేసే అవకాశం.. ప్రజా సేవకు జీవితాన్నిచ్చిన కోండ్రు మురళీమోహన్ కు నేను జీవితంలో రుణ పడి ఉంటానని ఆయన అన్నారు. నాకు గొప్ప భాగ్యమన్నారు. .తనకి ఈ అవకాశం లభించడం పట్ల వంగర మండల కూటమి పార్టీ నాయకులకు , టిడిపి పార్టీ మండల పెద్దలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సేవలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబును కోండ్రు మురళీమోహన్, కోండ్రు జగదీశ్వరరావు లను ఆదర్శంగా తీసుకొని వంగర మండల అభివృద్ధికి సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడి ప్రజల కోసం నిత్యము మరింత చురుకుగా పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.