BREAKING
బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీబీ నియంత్రణ కార్యక్రమంపై పర్యవేక్షణ

Select Suryaa Now
ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీబీ నియంత్రణ కార్యక్రమంపై పర్యవేక్షణ

నెల్లూరు, మేజర్ న్యూస్ :   జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని విజయ హాస్పిటల్, జయభారతి హాస్పిటల్‌లలోని ల్యాబ్‌లు, ఎక్స్‌రే కేంద్రాలను జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డాక్టర్ ఎస్.కే. ఖాదర్ వల్లి నవంబర్ 14వ తేదీన పర్యవేక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, పిల్లల్లో బరువు పెరగకపోవడం, దగ్గినప్పుడు కఫం రావడం వంటి లక్షణాలు ఉన్నవారిని టీబీ అనుమానితులుగా గుర్తించి వెంటనే టీబీ ఆసుపత్రులకు రెఫర్ చేయాలని ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బందికి సూచించారు.  రెఫర్ చేసిన వారికి కఫం పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహిస్తారని, టీబీ వ్యాధి నిర్ధారణ అయితే ఆరు నెలల పాటు ఉచితంగా చికిత్స మందులు అందజేస్తారని తెలిపారు. బాధితుల వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.  అలాగే టీబీ లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే వారి వివరాలను ప్రైవేట్ ఆసుపత్రులు సేకరించాలని, ఆ సమాచారాన్ని క్షయ నివారణ సిబ్బంది నిక్షయ్ వెబ్ పోర్టల్‌లో నమోదు చేస్తారని వివరించారు. అనంతరం ఆసుపత్రుల్లోని ల్యాబ్‌ల పనితీరును పరిశీలించారు.  జిల్లాలో ప్రస్తుతం నిర్వహిస్తున్న టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానంపై కూడా వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా టీబీ నివారణ కార్యక్రమం పీపీఎం కోఆర్డినేటర్ పి. హరీష్ తదితరులు పాల్గొన్నారు.