ప్రచారానికి సిద్ధమవుతున్న ఎంపీపీ అభ్యర్థి నారాయణస్వామి!
గరుగుబిల్లి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి తెలుగుదేశం పార్టీ సన్నద్ధ మవుతోంది ఇందులో భాగంగా పార్టీ అధిష్టానం ఎంపీపీ అభ్యర్థి తన అధి కారిక ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించేందుకు ముమ్మర సన్నా హాలు చేస్తున్నారు.పక్కా వ్యూహంతో క్షేత్రస్థాయిలోకి ఎన్నికల ప్రచారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ అధిష్టానం ఇప్పటికే గ్రామస్థాయి కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వ హించడం జరిగింది.ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా మార్చుకుంటూ గత ప్రభుత్వ వైఫల్యాలను తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ప్రజా సంక్షేమ పథకాల ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు.స్థానిక సంస్థ ల ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ తన జెండాను ఎగురవేయడమే లక్ష్యం గా అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా టిడిపి ఎంపీపీ అభ్యర్థి మరడాన నారాయణస్వామినాయుడు మండలంలోని ఆయా ఎంపీటీసీల పరిధిలో తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించేందుకు ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు.మండల పరిధి లోని అన్ని గ్రామాల్లో పసుపు పండుగ వాతావరణం నెలకొనేలా ప్రచార ప్రణా ళికను సిద్ధం చేశారు.ఈప్రచారంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను, "సూపర్ సిక్స్" హామీలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా ఎంపీపీ అభ్యర్థి మరడాన నారాయణస్వామినాయుడు వ్యూహర చన చేశారు.మండల పరిధిలోని స్థానిక సమస్యల పరిష్కారం,రోడ్ల అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలను తమ ప్రధాన ఎజెండాగా ప్రజల ముందు ఉంచబోతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తూ,పార్టీ సిద్ధాంతాలను వివరించే లా ప్రచారo సాగనుంది.తుఫాను వర్షాలు తగ్గిన అనంతరం గ్రామాల్లో ప్రచారాన్ని ప్రారంభించనున్నామని మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మరియు ఎంపీపీ అభ్యర్థి మరడాన నారాయణస్వామినాయుడు వెల్లడించారు.
రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.