పొన్నూరు 37వ వార్డులో జోరందుకున్న వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న వైసీపీ చైర్మన్ అభ్యర్థి షేక్ నాజిని
పొన్నూరు మేజర్ న్యూస్ :-పొన్నూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నూరు పట్టణం 37వ వార్డు తుకారం రైస్ మిల్ ఏరియాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది .పొన్నూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆశీస్సులతో, ఈ ప్రచార కార్యక్రమంలో సాగింది. పొన్నూరు వైఎస్ఆర్సిపి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి షేక్ నాజిని , కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షమీమున్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేశారు.ఈ సందర్భంగా వారు వార్డులో గడపగడపకు తిరిగి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. చైర్ పర్సన్ ఒకటి వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కి ఒకటి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతోగెలిపించవలసిందిగా కోరారు. వైసిపి చైర్ పర్సన్ అభ్యర్థి షేక్ నాజిని మాట్లాడుతూ......... రాష్ట్ర
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వార్డు ప్రజలకు వివరించారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి అన్నారు . పేదలు, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్