BREAKING
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి మెలియాపుట్టి ఎంపీపీగా బైరసింగి దినకర్.. వైస్ ఎంపీపీగా సలాన రోహిణి ఏకగ్రీవ ఎన్నిక నూతన ఎంపీపీకి ప్రెస్ క్లబ్ ఘన సన్మానం పొన్నూరు మున్సిపాలిటీ 11వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న……. ఎమ్మెల్యే దూళిపాళ్ళ తీపి పదార్థాలు ఇష్టమా.. రోజుకు ఎంత చక్కెర సురక్షితమో తెలుసుకోండి! సోమాలియా నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాయబారి వెళ్లిపోవాలని ఆదేశం.. ఇరు దేశాల మధ్య తీవ్ర దౌత్య సంక్షోభం! పాలెం బ్రిడ్జ్ స్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు. నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం తెంబూరు సర్పంచ్ అభ్యర్థిగా విజయలక్ష్మి నామినేషన్. నరసన్నపేట అభివృద్ధే నా లక్ష్యం.. 28 మండలాల్లో ప్రశాంతంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు.. మెలియాపుట్టి సర్పంచ్ అభ్యర్థిగా ఎరుసు పూర్ణిమ నామినేషన్ గ్రంథాలయ వారోత్సవాల్లో ఇందిరాగాంధీకి నివాళి ఇటలీలో వేలాది విద్యాసంస్థలకు తప్పుడు బాంబు బెదిరింపులు.. దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు! తమిళనాడు పెట్టుబడుల రహస్యాలు ఏపీకి లీక్?.. 15 మంది ఉద్యోగులపై విజయ్ సర్కార్ వేటు

ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధికి బాటలు వేస్తా

Select Suryaa Now
ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధికి బాటలు వేస్తా

- కొండారెడ్డిపల్లిలో బైరెడ్డి మల్లేశ్వరి ఎన్నికల ప్రచారం

- 26న జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించండి

పామూరు, మేజర్ న్యూస్ : వగ్గంపల్లి పంచాయతీ అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం కల్పించాలని టీడీపీ సర్పంచ్ అభ్యర్థి బైరెడ్డి మల్లేశ్వరి గ్రామ ప్రజలను అభ్యర్థించారు. గురువారం పంచాయతీ పరిధిలోని కొండారెడ్డిపల్లిలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి  ఆశీస్సులతో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని ఈ నెల 26న జరిగే ఎన్నికల్లో తనను ఆదరించి అమూల్యమైన ఓటుతో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పంచాయతీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, ఆదరణ తనకు ఎంతో ముఖ్యమని ఒక్క అవకాశం ఇచ్చి సర్పంచ్‌గా గెలిపించాలని బైరెడ్డి మల్లేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టిడిపి నేతలు పారా వెంకటేశ్వర్లు, బైరెడ్డి వెంకటేశ్వర్లు (తుపాన్ రెడ్డి), బైరెడ్డి సురేంద్ర, గంగిరెడ్డి వెంకటరెడ్డి, బైరెడ్డి రమణారెడ్డి, రెక్కల రమణారెడ్డి, ఎలికా నాగశేషులు, బైరెడ్డి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.