28 మండలాల్లో ప్రశాంతంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు..
- 27 మండలాల్లో టీడీపీ, ఒక మండలంలో బీజేపీ అభ్యర్థుల ఎంపిక.
- కోరం లేక శ్రీకాకుళం, గార మండలాల్లో వాయిదా..
శ్రీకాకుళం నవంబర్ 19 మేజర్ న్యూస్: జిల్లాలోని 30 మండల ప్రజా పరిషత్‌లకు (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు గురువారం నిర్వహించిన పరోక్ష ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 30 మండలాలకు గాను 28 మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు సజావుగా నిర్వహించారు. శ్రీకాకుళం, గార మండలాల్లో తగినంత కోరం లేకపోవడంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ఈ మేరకు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఆర్. వెంకట రామన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
జిల్లాలో ఎన్నికలు జరిగిన 28 మండలాల్లో 27 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపీపీ పదవులను దక్కించుకోగా, లావేరు మండలంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపీపీగా ఎన్నికయ్యారు. దీంతో జిల్లాలో ఎంపీపీ పదవుల్లో కూటమి పార్టీల ఆధిపత్యం స్పష్టమైంది.
ఎన్నికైన ఎంపీపీలు, వైస్ ఎంపీపీల వివరాలు:
1. ఆమదాలవలస: తమ్మినేని భారతమ్మ (ఎంపీపీ), వందన శ్రీదేవి (వైస్ ఎంపీపీ).
2. బూర్జ: ఆనెపు శ్రీదేవి (ఎంపీపీ), వావిలపల్లి సీతారాంబాబు (వైస్ ఎంపీపీ).
3. ఎచ్చెర్ల: బెండు రమాదేవి (ఎంపీపీ), బల్లాడ అరుణ (వైస్ ఎంపీపీ).
4. జి.సిగడాం: దర్రు రమణమ్మ (ఎంపీపీ), కొంపెల్ల లక్ష్మి (వైస్ ఎంపీపీ).
5. జలుమూరు: వెలమల భవాని (ఎంపీపీ), సనపల రమణమూర్తి (వైస్ ఎంపీపీ).
6. లావేరు: ఇజ్జాడ శ్రీనివాసరావు (బీజేపీ – ఎంపీపీ), నడిమింటి రూపకుమారి (వైస్ ఎంపీపీ).
7. నరసన్నపేట: సిమ్మ లక్ష్మి (ఎంపీపీ), తలభక్తుల మాధవి (వైస్ ఎంపీపీ).
8. పోలాకి: మిరియప్పల్లి వెంకటప్పలనాయుడు (ఎంపీపీ), కరుకోల లత (వైస్ ఎంపీపీ).
9. పొందూరు: కూన సుధ (ఎంపీపీ), పొందూరు రామకృష్ణారావు (వైస్ ఎంపీపీ).
10. రణస్థలం: లంక ప్రభాకరరావు (ఎంపీపీ), పిన్నింటి వెంకట్రావు (వైస్ ఎంపీపీ).
11. సరుబుజ్జిలి: పెదడ వెంకటరమణమూర్తి (ఎంపీపీ), డోల ప్రభావతి (వైస్ ఎంపీపీ).
12. హిరమండలం: పొగిరి బుచ్చిబాబు (ఎంపీపీ), సాహుకారి మంగమ్మ (వైస్ ఎంపీపీ).
13. కోటబొమ్మాళి: తర్ర రామకృష్ణ (ఎంపీపీ), కల్లి యమునారెడ్డి (వైస్ ఎంపీపీ).
14. కొత్తూరు: తొంపల నాగమణి (ఎంపీపీ), అగతముడి అరుణ్ కుమార్ (వైస్ ఎంపీపీ).
15. ఎల్.ఎన్.పేట: వెలమల సుగుణ (ఎంపీపీ), అంపిలి రోహిణి (వైస్ ఎంపీపీ).
16. మెళియాపుట్టి: బైరసింగి దినకర్ (ఎంపీపీ), సాలాన రోహిణి (వైస్ ఎంపీపీ).
17. నందిగాం: పినకాన మోహిని (ఎంపీపీ), బెండి రాణి (వైస్ ఎంపీపీ).
18. పాతపట్నం: సీమ మీనాక్షిదేవి (ఎంపీపీ), పైల ప్రియాంక (వైస్ ఎంపీపీ).
19. సంతబొమ్మాళి: సుగ్గు శాంతిస్వరూప్ రెడ్డి (ఎంపీపీ), కొర్రాయి అనసూయ (వైస్ ఎంపీపీ).
20. సారవకోట: మరడ సంధ్య (ఎంపీపీ), కోన వెంకటేశ్వరరావు (వైస్ ఎంపీపీ).
21. టెక్కలి: బగాది రమాదేవి (ఎంపీపీ), కొల్ల కామేశ్వరరావు (వైస్ ఎంపీపీ).
22. ఇచ్ఛాపురం: మెరుగు సూర్యనారాయణ (ఎంపీపీ), కల్ల నీలవేణి (వైస్ ఎంపీపీ).
23. కంచిలి: మాదిన విమల (ఎంపీపీ), పైల శారద (వైస్ ఎంపీపీ).
24. కవిటి: సీపాన రాణి (ఎంపీపీ), జయశ్రీ పట్నాయకుని (వైస్ ఎంపీపీ).
25. మందస: బావన కూర్మావతి (ఎంపీపీ), కొండపల్లి నారాయణరావు (వైస్ ఎంపీపీ).
26. పలాస: కుత్తుం రూపావతి (ఎంపీపీ), పోలాకి శారద (వైస్ ఎంపీపీ).
27. సోంపేట: సూరాడ జానకి (ఎంపీపీ), రెల్ల జ్యోతి (వైస్ ఎంపీపీ).
28. వజ్రపుకొత్తూరు: పుచ్చ శోభారాణి (ఎంపీపీ), లండ శారద (వైస్ ఎంపీపీ).
శ్రీకాకుళం, గార మండలాల్లో కోరం లేక ఎన్నికలు నిర్వహించలేకపోయారు. మిగిలిన మండలాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తవడంతో నూతనంగా ఎన్నికైన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.