మెలియాపుట్టి సర్పంచ్ అభ్యర్థిగా ఎరుసు పూర్ణిమ నామినేషన్
ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆశీస్సులతో ఎన్నికల బరిలో.. తరలివచ్చిన గ్రామస్థులు, పార్టీ శ్రేణులు
మెలియాపుట్టి. నవంబర్ 19. మేజర్ న్యూస్...
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మెలియాపుట్టి గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎరుసు పూర్ణిమ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆశీస్సులతో ఆమె ఎన్నికల బరిలో నిలవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
పూర్ణిమ నామినేషన్ కార్యక్రమానికి గ్రామస్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను దాఖలు చేశారు.