గ్రంథాలయ వారోత్సవాల్లో ఇందిరాగాంధీకి నివాళి
మెలియాపుట్టి. నవంబర్ 19. మేజర్ న్యూస్..
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మెలియాపుట్టి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారిణి ఆర్. అనురాధ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాగాంధీ జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మహాలక్ష్మి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రంగవల్లికల పోటీలు నిర్వహించారు. వారోత్సవాల్లో వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు శుక్రవారం ఉదయం 10 గంటలకు గ్రంథాలయంలో బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంబాబు, సూర్యకుమారి, నీలిమ, స్వాతి, పాఠకుడు మణి లక్ష్మీపతి, సహాయకురాలు హేమలత పాల్గొన్నారు.