నరసన్నపేట అభివృద్ధే నా లక్ష్యం..
: పొట్నూరు వాణి సాయి ప్రసాద్..
- మారుతి నగర్‌లో ఇంటింటి ప్రచారం..
- మద్దతు కోరిన సర్పంచ్ అభ్యర్థి
నరసన్నపేట నవంబర్ 19 మేనేజర్ న్యూస్ : నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పొట్నూరు వాణి సాయి ప్రసాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, నరసన్నపేట అభివృద్ధికి తనకు అవకాశం కల్పించి మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
ఈ క్రమంలో గురువారం పట్టణంలోని మారుతి నగర్ ప్రాంతంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. నరసన్నపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా వివరించారు.
పంచాయతీ అభివృద్ధికి ప్రజల సహకారం, ఆశీర్వాదం ఎంతో అవసరమని పేర్కొంటూ తనకు ఒక అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బూరళ్లి శంకర్, చీపురు కృష్ణతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని వాణి ప్రసాద్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.