తెంబూరు సర్పంచ్ అభ్యర్థిగా విజయలక్ష్మి నామినేషన్.
పాతపట్నం నవంబర్ 19,మేజర్ న్యూస్:
పాతపట్నం మండలం తెంబూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బెనియా విజయలక్ష్మి వెంకటరమణ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా తెంబూరు లోని మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పాతపట్నం అమ్మవారి గుడి నుంచి నామినేషన్ కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ ప్రక్రియ విజయవంతం చేశారు. తెంబూరు అభివృద్ధికి అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉండి తెంబూరు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్న వెళుతున్న యువ నాయకులకు ప్రజల మద్దతు తెలుపుతూ ర్యాలీ విజయవంతం చేశారు. ఈసారి సర్పంచిగా గెలిపిస్తే తెంబూరు మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని సర్పంచ్ అభ్యర్థి విజయలక్ష్మి వెంకటరమణ అన్నారు. ఈ కార్యక్రమంలో తెంబూరు ఎంపీటీసీ అన్నెపు. ఉమామహేశ్వరరావు, పేడాడ మన్మధరావు, మాజీ సర్పంచ్ బెనియా వెంకటరమణ, లింగాల పాల్గున రావు, ఎర్ర ఈశ్వరరావు, దాసరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.