పోలింగ్ సమరానికి సర్వం సిద్ధం.. ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తి
గరుగుబిల్లి, నవంబర్ 25, మేజర్ న్యూస్:గ్రామ పంచాయతీ (సర్పంచ్) ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పోలింగ్ సామగ్రి (మెటీరియల్) పంపిణీ ప్రక్రియను స్థానిక మండల ప్రజా పరి షత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ, అధికారులు బుధవారం విజయవంతంగా పూర్తి చేశారు.ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎంపీడీవో కార్యాలయ ప్రాంగ ణం ఎన్నికల సిబ్బందితో సందడిగా మారింది.రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వోలు), పోలింగ్ సిబ్బందికి కేటాయించిన గ్రామాల వారీగా సామగ్రిని మండల పరిషత్తు అభివృద్ధి కార్యాలయం ఏవో నాలి అర్జునరావు ఆధ్వర్యంలో అందజే శారు.బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, చెరగని సిరా (ఇండెలిబుల్ ఇంక్), ఓటర్ల జాబితాలు, వివిధ రకాల ఫారాలు, స్టేషనరీ తదితర వస్తువులను సిబ్బందికి అప్పగించారు.సామగ్రి తీసుకున్న అనంతరం సిబ్బంది తమకు కేటాయించిన వస్తువులు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకున్నారు.ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ దగ్గ రుండి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షిం చారు.పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.అనంతరం ప్రత్యేక వాహనాల్లో, పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ సిబ్బంది తమకు కేటా యించిన గ్రామాలకు తరలి వెళ్లారు.
ఈసందర్భంగా ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వెంటనే భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను సరిచూసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఏవో నాలి అర్జున రావు, డిప్యూటీ ఎంపీడీవో మరడాన వెంకటేశ్వరరావు,కార్యాలయ సిబ్బంది బెంకిలి శ్రీనివాసరావు ఎన్ కులశేఖర్, రమణమ్మ, వాకాడ శారద, గుంట్రేడ్డి కృష్ణప్రసాద్,గంట విజయలక్ష్మి, డాకోజు సూర్యప్రభాకర్, జి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.