పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది..
సీతానగరం, నవంబర్ 25, మేజర్ న్యూస్:మండల పరిధిలోని నిబంధనల ప్రకారం గురువారం ఉదయం నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే అప్పలనాయుడు. మండల తహసిల్దార్ పీ ప్రసన్నకుమార్. డిప్యూటీ ఎంపీడీవో వర్మ లు తెలిపారు.
ఈ మేరకు ఆయా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహ ణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.జోనల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబం ధించి ఎన్నికల విధులకు కేటాయించే సిబ్బందిఉదయాన్నే డిస్ట్రిబ్యూషన్ కేంద్రo వద్దకు చేరుకున్న పీవో, ఏపీవో మరియు ఇతర పోలింగ్ సిబ్బందికి అధికారులు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఓటర్ల జాబితాలు, ఇతర ఎన్నికల సామగ్రిని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం అధికారులు అందజేశారు.అనంతరం ప్రత్యేక వాహనాల్లో జోనల్ ఆఫీసర్లు పర్యవేక్షణలో సిబ్బందిని ఆయా గ్రామాలలోని పోలిం గ్ బూత్‌లకు తరలించారు.కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలన, పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది, జోనల్ ఆఫీసర్ల సూచనల మేరకు ఓటింగ్ కంపార్ట్ మెంట్ల ఏర్పాటు, ఓటర్లు క్యూలైన్లలో నిలబడేందుకు బారికేడ్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలను పరిశీలించా రు.ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.