వైస్ చైర్మన్ ను సన్మానించిన వాకర్స్ క్లబ్ ప్రతినిధులు
మేజర్ న్యూస్ సాలూరు నవంబర్ 25
మున్సిపల్ వైస్ చైర్మన్ పప్పల మోహన్రావును వాకర్స్ క్లబ్ ప్రతినిధులు సన్మానించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తనదైన శైలిలో మంత్రి సంధ్యారాణి వ్యూహాత్మకంగా పావులు కదిపి, ప్రత్యర్థులను మూడు చెరువుల నీళ్లు తాగించి, తన అనుకున్న పప్పల మోహన్ రావును వైస్ చైర్మన్ గా గెలిపించుకొచ్చారు. అటువంటి వైస్ చైర్మన్ గోపాల్ మోహన్ రావును వాకర్స్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దుస్సాలతో వైస్ చైర్మన్ ను పతేడ వెంకటరావు, రావాడ భాస్కరరావు, పుప్పాల గోవిందరావు, వాసు, కర్రి శ్రీను, కాశీ మాస్టారు, శంకర్రావు, వైకుంఠపు దుర్గాప్రసాద్ తదితరులు సత్కరించారు.