పోలింగ్ కేంద్రాలపై పోలీసుల నిఘా
భోగాపురం, సూర్య : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భోగాపురం మండలంలోని పోలింగ్ కేంద్రాలను సీఐ అదబాల రవికుమార్, ఎస్‌ఐ ఆర్. రమేష్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలు, భద్రతాపరమైన అంశాలను తనిఖీ చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి సారించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. వీటితో పాటు సమస్యాత్మకం, అతి సమస్యాత్మకం ప్రాంతాలను సందర్శించి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
రిపోర్టర్ : వై శ్రీనివాస రావు, భోగాపురం, విజయనగరం జిల్లా.