పొగాకు కొనుగోలు సంబంధించి సముచిత రీతిలో చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ పి.రాజబాబు
ఒంగోలు, మేజర్న్యూస్ :
ప్రైవేటు కంపెనీ వాళ్లతో వివరంగా చర్చించి జిల్లాలో పొగాకు కొనుగోలు సంబంధించి సముచిత రీతిలో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రాజబాబు సంబంధిత అధికారిని ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులు మరియు టొబాకో బోర్డు వారితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు పంటని ఎక్కువ వేయకుండా చూడాలని తగిన అనుమతులు లేకుండా పొగాకు పంట వేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అట్టివారికి ప్రభుత్వం నిర్దేశించిన ధరలు చెల్లించడం జరుగుదని ఆయన ఉద్ఘాటించారు. పొగాకు కొనుగోలు కేంద్రాల వద్ద వ్యవసాయ శాఖ ప్రత్యేక అధికారులను ఉంచడం జరిగిందని కొనుగోలు విషయమై వారితో చర్చించి వారి సూచనలు సలహాలు రైతులు తీసుకోవాల్సిందిగా ఆయన తెలిపారు. మండలాల వారీగా సర్వే నిర్వహించి ఎంతమంది టొబాకో పంటలను వేస్తున్నారు గుర్తించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
భారీ వర్షాలు నేపథ్యంలో ముందస్తు చర్యలు::-
తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో భారీ వర్షాలు రానున్నాయని నష్ట నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ, హార్టికల్చర్, మత్స్యశాఖ, ఇతర శాఖ అధికారులు మరియు విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించవలసి ఉందని తదనుగుణంగా నష్ట నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారులను అప్రమత్తం చేయాలని సముద్రంలో ఎవరు వెళ్లకుండా చూడాలని సంబంధిత అధికారికి సూచించారు. చేపల వేటకై ఉపయోగించే బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా సెల్ టవర్ల వద్ద విద్యుత్ సప్లై కు ప్రత్యామ్నయం తీసుకోవాలని జనరేటర్లు ఏర్పాటు చేసుకొని సమాచార లోపం లేకుండా చూడవలసిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి శ్రీనివాసరావు, హార్టికల్చర్ అధికారి గోపీనాథ్, మత్స్య శాఖ గారి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.