వైకాపా నేత శివనాగిరెడ్డికి పితృవియోగం
నంద్యాల టౌన్ మేజర్ న్యూస్: నంద్యాల పట్టణంలోని వైఎస్సార్ నగర్‌కు చెందిన వైకాపా నాయకుడు శివనాగిరెడ్డి తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరణవార్త తెలుసుకున్న పలువురు స్థానికులు, పార్టీ శ్రేణులు శివనాగిరెడ్డి నివాసానికి చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి వైఎస్సార్ నగర్‌లోని శివనాగిరెడ్డి నివాసానికి చేరుకొని. శివనాగిరెడ్డి తండ్రి భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తీవ్ర దుఃఖంలో ఉన్న శివనాగిరెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పరామర్శించి ఓదార్చారు. ఈ కష్టసమయంలో కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి వెంట స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
జయ భారత్ రెడ్డి నంద్యాల టౌన్ మేజర్ న్యూస్