అనకాపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల
అనకాపల్లి ప్రతినిధి, నవంబర్ 16, మేజర్ న్యూస్:
అనకాపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు - 2026 రెండో విడత (ఫేజ్-II) ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం ఉదయం విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్, తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ నెం. 1800/SEC-B2/2026 జారీ అయిందన్నారు.జిల్లాలో రెండవ విడతలో అనకాపల్లి రెవిన్యూ డివిజన్ కు సంబంధించి మునగపాక మండలం, అడ్డ రోడ్డు రెవెన్యూ డివిజన్ కు సంబంధించి కోటవురట్ల, నక్కపల్లి , పాయకరావుపేట, ఎస్ రాయవరం, అచ్యుతాపురం, రాంబిల్లి మరియు ఎలమంచిలి మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2006 ప్రకారం ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూల్స్ లోని 6 నియమం కింద ఎన్నికల నోటీసు జారీ మరియు గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారి జారీ చేసిన రూల్ 5 ప్రకారము వార్డు వారీ ఓటర్ల జాబితా ప్రదర్శన నవంబర్ 18, 2026 (ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు) నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 20, 2026 (సాయంత్రం 5:00 వరకు).నామినేషన్ల పరిశీలన నవంబర్ 21, 2026 (ఉదయం 8:00 నుండి).నామినేషన్ల తిరస్కృతిపై అప్పీల్ దాఖలుకు అవకాశం (రెవెన్యూ డివిజనల్ అధికారి పరిశీలన) నవంబర్ 22, 2026 (సాయంత్రం 5:00 వరకు).అప్పీల్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ నవంబర్ 23, 2026.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 24, 2026 (సాయంత్రం 3:00 వరకు).అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ నవంబర్ 24, 2026 (సాయంత్రం 3:00 తర్వాత).
పోలింగ్ నవంబర్ 29, 2026 (ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు).
ఓట్ల లెక్కంపు మరియు ఫలితాల ప్రకటన: నవంబర్ 29, 2026 (మధ్యాహ్నం 2:00 నుండి లెక్కంపు పూర్తయిన వెంటనే ఫలితాల ప్రకటన)
ఫలితాలు ప్రకటించిన రోజే ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించబడుతుంది.ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైనచో 30-11-2026 ఉదయం 7-00 గంటల నుంచి మధ్యాహ్నం 1-00 వరకు నిర్వహించడం జరుగుతుందని, మధ్యాహ్నం 2-00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేసి, కోట్ల లెక్కింపు పూర్తి అయిన తదుపరి ఫలితం ప్రకటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.అభ్యర్థులు మరియు ఓటర్లు అందరూ ఈ ముఖ్యమైన తేదీలు, సమయాలను గమనించి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్ కోరారు.
రవి కుమార్,జిల్లా ఇంచార్జ్ NDP surya