BREAKING
వైకాపా నేత శివనాగిరెడ్డికి పితృవియోగం నిఫ్టీ 50 Q2 స్కోర్‌కార్డ్: 28 కంపెనీల జోరు, అదానీ స్టాక్స్ అదుర్స్! నవజాత శిశు సంరక్షణపై అవగాహనా సదస్సు: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అధ్యక్షతన కార్యక్రమం బ్రెక్సిట్‌తో యూకేకు లాభం కంటే నష్టమే ఎక్కువ: ఆండీ బర్న్‌హామ్! ప్రజావాణికి మూడు దరఖాస్తులు అనకాపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల భారత్‌కు చేరుకున్న ప్రిన్స్ విలియం దంపతులు: ప్రధాని మోదీతో భేటీ! సన్నీ డియోల్ సూర్య చిత్రానికి చిక్కులు.. విడుదల జనవరికి వాయిదా? అమెరికాలో నటుడు కాదంబరి కిరణ్ కుమార్తె కృతి సీమంతం వేడుక.. ఫొటోలు వైరల్! కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని అధికారులు రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడు శశాంక్ నిశ్చితార్థం ఖరారు! బడ్జెట్ 2027: ఆర్థికవేత్తలతో నిర్మలా సీతారామన్ ప్రీ-బడ్జెట్ భేటీ! వీఎఫ్ఎక్స్ బాగోలేదని తిడుతున్నారు.. రెండు నెలల ముందే సినిమా పూర్తి చేయండి: నాగార్జున కీలక సూచన! నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ... కోల్స్ ఆనందపురం గ్రామంలో విషాదం.. బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత మానవత్వంతో కుటుంబాన్ని పరామర్శించిన టేకూరి నాగేశ్వరరావు

నవజాత శిశు సంరక్షణపై అవగాహనా సదస్సు: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అధ్యక్షతన కార్యక్రమం

Select Suryaa Now
నవజాత శిశు సంరక్షణపై అవగాహనా సదస్సు: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అధ్యక్షతన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నవంబర్ 16: : జాతీయ నవజాత శిశు సంరక్షణ వారోత్సవాలు సందర్భంగా నవంబర్ 15 నుంచి 21 వరకు నిర్వహిస్తున్న అవగాహనా కార్యక్రమాల్లో భాగంగా, ప్రభుత్వ వైద్య కళాశాల  రాజమహేంద్రవరంలో సోమవారం 16.11.2026 న ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అధ్యక్షతన అవగాహనా సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, పిల్లలు కేవలం వారి కుటుంబాలకు మాత్రమే సంపద కాదు, దేశానికి కూడా అమూల్యమైన సంపద అని పేర్కొన్నారు. భావి భారతదేశం సుసంపన్నంగా అభివృద్ధి చెందాలంటే భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలని, అందుకు నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది నవజాత శిశువుల ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ చర్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించాలని సూచించారు.
ప్రస్తుత యువతే రేపటి తల్లిదండ్రులు కాబట్టి, నవజాత శిశు సంరక్షణపై వారికి ముందుగానే అవగాహన కల్పించాలని అన్నారు. బిడ్డకు మొట్టమొదటి వైద్యులు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులేనని, అందువల్ల వారు శిశు సంరక్షణ పట్ల బాధ్యతాయుతంగా, చైతన్యవంతంగా ఉండాలని కోరారు. పాశ్చాత్య దేశాలు నవజాత శిశు మరణాలను గణనీయంగా తగ్గించాయని, భారతదేశం కూడా అదే దిశగా పురోగమిస్తోందని తెలిపారు. మన రాష్ట్రంలోనూ శిశు మరణాల రేటును సింగిల్ డిజిట్‌కు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని, ప్రభుత్వ కార్యక్రమాల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ చేరేలా అందరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
శిశువులను అల్ప ఉష్ణోగ్రత నుంచి రక్షించేందుకు కంగారూ మదర్ కేర్ ఎంతో ఉపయోగకరమని, తల్లి మాత్రమే కాకుండా తండ్రి కూడా ఈ విధానాన్ని అనుసరించవచ్చని వివరించారు. వైద్య విద్యార్థులు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని, వాటి ఉద్దేశాలను తెలుసుకుని, తమ వ్యక్తిగత జీవితంలోనూ, సమాజంలోనూ ఆచరించేలా కృషి చేయాలని సూచించారు. ఆయా విభాగాల లాగ్‌బుక్స్‌లో జాతీయ కార్యక్రమాల వివరాలు, ముఖ్యాంశాలను తప్పనిసరిగా నమోదు చేయాలని వైద్య విద్యార్థులను  ఆదేశించారు.
డా. బి. శ్రీనివాస్ నాయక్, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు సమన్వయాధికారి మాట్లాడుతూ, నవజాత శిశు ఆరోగ్య పరిరక్షణ గర్భధారణ దశ నుంచే ప్రారంభం కావాలని, ప్రసవానంతర తొలి 28 రోజులు అత్యంత కీలకమైనవని తెలిపారు. ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నవజాత శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించడం, పుట్టిన వెంటనే అవసరమైన వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, వయస్సుకు అనుగుణంగా టీకాల షెడ్యూల్‌ను పాటించడం, కంగారూ మదర్ కేర్‌ను అమలు చేయడం వంటి చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో వైద్య విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
పీడియాట్రిక్స్ విభాగాధిపతి డా. మోహన్ చంద్రన్ మాట్లాడుతూ, నవజాత శిశువుల్లో కనిపించే ప్రమాదకర లక్షణాలను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ముందుగానే గుర్తించగలగాలని తెలిపారు. జనన సమయంలో శ్వాస సంబంధిత సమస్యలు పుట్టుకతో వచ్చే లోపాలు  నివారణకు గర్భధారణ సమయంలోనే తగిన వైద్య పరీక్షలు, జాగ్రత్తలు అవసరమన్నారు. పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించాలని, ముర్రు పాలు (కొలస్ట్రం) శిశువుకు సహజ వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయని వివరించారు. చేతుల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, బాటిల్ ఫీడింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. శిశు మరణాల రేటును తగ్గించడంలో కేరళ రాష్ట్రం సాధించిన పురోగతిని ఆదర్శంగా తీసుకుని మన రాష్ట్రంలోనూ సింగిల్ డిజిట్ లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు.
పీడియాట్రిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. పూర్ణిమ మాట్లాడుతూ, పుట్టిన ప్రతి శిశువుకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు (స్క్రీనింగ్) నిర్వహించి, సమస్యలను ముందుగానే గుర్తించి సరైన సమయంలో చికిత్స అందించాలని తెలిపారు. శిశువులో వేగంగా శ్వాస తీసుకోవడం, ఛాతీ లోపలికి లాగబడటం, పాలు సరిగా తాగకపోవడం వంటి ప్రమాద సంకేతాలను తల్లిదండ్రులు గుర్తించాలని, అటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సేవలు పొందాలని సూచించారు.
మైక్రోబయాలజీ విభాగాధిపతి డా. భారతి మాట్లాడుతూ, శిశు మరణాలను తగ్గించాలంటే గర్భిణీ స్త్రీలకు గర్భధారణ కాలం నుంచే సమతుల్య ఆహారం, అవసరమైన టీకాలు, మందులు, తగిన విశ్రాంతి, నిరంతర వైద్య పర్యవేక్షణ అందించాలని తెలిపారు.
ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డా. రమేష్ బాబు మాట్లాడుతూ, శిశు మరణాల రేటు తగ్గించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న జనని శిశు సురక్షా కార్యక్రమం  జనని సురక్షా యోజన , సుమన్  సంస్థాగత ప్రసవాలు వంటి పథకాల  ప్రయోజనాలను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
బయోకెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. అపర్ణ మాట్లాడుతూ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై వైద్య విద్యార్థులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, రేపటి వైద్యులుగా ప్రజారోగ్య పరిరక్షణలో వారు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాల సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని, తమ వ్యక్తిగత అకడమిక్ కెరీర్ లో కూడా ఈ కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండటం విద్యార్థులకు మేలు చేకూరుతుందని  తెలియజేశారు.
ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు మాట్లాడుతూ, నవజాత శిశు దశ అత్యంత సున్నితమైనదని, ఈ దశలో సరైన సంరక్షణ, పోషణ, పరిశుభ్రత, సమయానుకూల వైద్య సేవలు అందించడం ద్వారా అనేక శిశు మరణాలను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరం

జారీచేసినవారు

HOD  పెడియాట్రిక్స్ GMC రాజమహేంద్రవరం