BREAKING
పెండింగ్‌ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలి - మంచిర్యాల డీసీపీ న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టీమిండియాలోకి యువ సంచలనం ఎంట్రీ! 49 వ వార్డు టిడిపి అభ్యర్థి పొట్నూరు నీలవేణి ఎన్నికల ప్రచారం స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం ఘనంగా ప్రభాస్ జన్మదినోత్సవం తూకివాకం ఎంపీటీసీ అభ్యర్థిగా మునీశ్వరి నామినేషన్ యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి వైసిపి 48 వ వార్డు అభ్యర్థి కర్రిరామరెడ్డి ఎన్నికల ప్రచారం పాత గొడవలతో వ్యక్తిపై దాడి ఒక్కరోజే 20 నామినేషన్లు దాఖలు బోని ఎంపీటీసీ అభ్యర్థిగా తాట్రాజు అప్పారావు నామినేషన్‌.. గేలిచివస్తే ఎంపీపీ... అధిష్టానం గ్రీన్ సిగ్నల్.! రాష్ట్రంలో గ్లోబల్‌ స్పిరిట్స్‌ బ్రాండ్ల విక్రయాలకు శ్రీకారం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా కంగా నెల్లూరు వెంకటరమణ! 16 వ వార్డు లో ఏడువాక విస్తృత ప్రచారం * విజయం వైపు దూసుకు వెళ్తున్న ఏడువాక శ్రీ మహాలక్ష్మి సన్యాసిరావు * తూంకుంట గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు..*

పొదలకూరులో ఎన్నికల భద్రతపై పోలీసుల ప్రత్యేక నిఘా

Select Suryaa Now
పొదలకూరులో ఎన్నికల భద్రతపై పోలీసుల ప్రత్యేక నిఘా

పొదలకూరు,  మేజర్ న్యూస్ :    పరిషత్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పొదలకూరు మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియను నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. నామినేషన్ల దాఖలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసు అధికారులకు సూచించారు. నామినేషన్ల స్వీకరణతో పాటు పరిశీలన సమయంలోనూ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, అభ్యర్థులు, వారి అనుచరుల రాకపోకలను పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పొదలకూరు సీఐ గుత్తి వెంకట్రావు, ఎస్సై శివ రాకేష్‌లకు భద్రతా నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తూ, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించిందని ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు.