రాష్ట్రంలో గ్లోబల్ స్పిరిట్స్ బ్రాండ్ల విక్రయాలకు శ్రీకారం
నెల్లూరు,అర్బన్, క్రైమ్, మేజర్ న్యూస్ : స్వతంత్ర, కుటుంబ యాజమాన్యంలోని అంతర్జాతీయ స్పిరిట్స్ సంస్థ విలియం గ్రాంట్ అండ్ సన్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌లోకి ప్రవేశించింది.ఈ సందర్భంగా కంపెనీకి చెందిన గ్లెన్‌ఫిడిచ్ 12, 15 ఏళ్ల సింగిల్ మాల్ట్ విస్కీలు, మంకీ షోల్డర్ విస్కీ, హెండ్రిక్స్ జిన్, గ్రాంట్స్ విస్కీ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి.తొలిదశలో కీలక పట్టణాలు, వాణిజ్య కేంద్రాల్లో ఎంపిక చేసిన రిటైల్ దుకాణాలు,హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య విక్రయ కేంద్రాల్లో వీటి లభ్యతను పెంచడంపై కంపెనీ దృష్టి సారించనుంది. అనంతరం దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది.భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పంపిణీ వ్యవస్థను విస్తరించడం, తమ బ్రాండ్ల లభ్యతను మెరుగుపరచడం, వ్యూహాత్మకంగా కీలకమైన మార్కెట్లలో దీర్ఘకాలికంగా స్థిరపడటం లక్ష్యంగా కంపెనీ ఈ చర్య చేపట్టింది.ఈ సందర్భంగా విలియం గ్రాంట్ & సన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కార్తిక్ మొహింద్రా మాట్లాడుతూ..భారతదేశంలో తమ వ్యాపార విస్తరణలో ఆంధ్రప్రదేశ్ ప్రవేశం మరో కీలక ముందడుగని పేర్కొన్నారు.కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడంతోపాటు, ఆయా ప్రాంతాలకు అనుగుణమైన బ్రాండ్ల ఎంపిక, వాణిజ్య భాగస్వామ్యాల బలోపేతం, బ్రాండ్ల అభివృద్ధికి నిరంతర పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.విలియం గ్రాంట్ అండ్ సన్స్ ఇండియా సేల్స్ హెడ్ రోహిత్ కుమార్ మాట్లాడుతూ.. వివిధ విక్రయ మార్గాలు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తమ బ్రాండ్లను అభివృద్ధి చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ మంచి అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. ప్రతి బ్రాండ్‌కు తగిన పంపిణీ వ్యవస్థ, మార్కెట్ గుర్తింపు, వాణిజ్యపరమైన మద్దతు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.