BREAKING
1న ఢిల్లీలో 10 వేల మందితో భారీ నిరసన: స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ నవంబర్‌ 1న నిర్వహణ డిండి ప్రాజెక్టు పేరుతో నల్గొండ కు నీరు తరలించే కుట్ర పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసులకు వ్యాసరచన పోటీలు జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇంటింటా ప్రచారం యాదగిరిగుట్ట దేవస్థానంలో దళిత వర్గాల ఉద్యోగులకు ప్రమోషన్ లు తక్షణమే ఇవ్వాలి ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా స్త్రీనిధి రుణాల రీపేమెంట్‌లో బాబురాజుకు రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం…కరీంనగర్ జిల్లాకు ద్వితీయ స్థానం ధర్మవరం రూరల్ సీఐపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపణలు నిరాధారమే: పోలీసుల స్పష్టీకరణ గ్రామ గ్రామాన అభివృద్ధి.. గడపగడపకు సంక్షేమం స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు నెల్లిమర్ల జెడ్పీటీసీ స్థానానికి నలుగురు నామినేషన్లు దాఖలు మాగనూర్ నూతన ఎస్సైగా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ నగరాభివృద్ధి ఘనత టిడిపిదే -స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే -రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ నేను హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇడుపు కాయితం వేడుకలో నాగదుర్గ భావోద్వేగం! ముగిసిన నామినేషన్ల పర్వం

ఒక్కరోజే 20 నామినేషన్లు దాఖలు

Select Suryaa Now
ఒక్కరోజే 20 నామినేషన్లు దాఖలు

పొదలకూరు, మేజర్ న్యూస్ :    పొదలకూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మండలంలోని 19 ఎంపీటీసీ స్థానాలకు ఇప్పటివరకు మొత్తం 95 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. గురువారం వరకు నమోదైన నామినేషన్లతో కలిపి శుక్రవారం ఒక్కరోజే 20 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీలు వారీగా పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి అత్యధికంగా 48 నామినేషన్లు దాఖలు కాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నుంచి 44 నామినేషన్లు నమోదయ్యాయి. బీజేపీ, సీపీఐ, జనసేన పార్టీల నుంచి ఒక్కొక్క నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 95కు చేరింది. ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ మధ్య నామినేషన్ల సంఖ్యలో స్వల్ప వ్యత్యాసం ఉండటంతో మండలంలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన వివరాలను పొదలకూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారిక నివేదిక ద్వారా వెల్లడించారు.