వైసిపి 48 వ వార్డు అభ్యర్థి కర్రిరామరెడ్డి ఎన్నికల ప్రచారం
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 48 వ వార్డు వైసీపీ అభ్యర్థి కర్రీరామరెడ్డి వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ 48 వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు తమ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆడారి. పారుపల్లి రవి, పిల్ల గోపి, మౌలిక రెడ్డి, ఆడారి విజయశంకర్, చంద్రకళ, కృష్ణవేణి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.