బోని ఎంపీటీసీ అభ్యర్థిగా తాట్రాజు అప్పారావు నామినేషన్.. గేలిచివస్తే ఎంపీపీ... అధిష్టానం గ్రీన్ సిగ్నల్.!
ఆనందపురం, సూర్య : ఆనందపురం మండలం బోని ఎంపీటీసీ స్థానానికి టీడీపీ పార్టీ అభ్యర్థిగా తర్లువాడ గ్రామానికి చెందిన తాట్రాజ్ అప్పారావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనందపురం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నామినేషన్ పత్రాలను సమర్పించారు. పరిషత్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలిరోజే ఆయన తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నారు. ఆనందపురం టిడిపి పార్టీ ప్రెసిడెంటె గా మండల ప్రజలతో అనుబంధం ఉంది.
గతంలో జడ్పిటిసి గా పోటీ చేసిన అనుభవం ఉంది.తన అన్నయ్య (లేటు)తాట్రాజ్ ఆదినారాయణ తర్లువాడ సర్పంచ్ గా గెలుపొందారు. తాట్రాజు కుటుంబానికి మండల, గ్రామస్థాయ పాలనపై అనుభవం ఉంది. స్థానిక సమస్యలపై అవగాహనతో పాటు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రస్తావనీయమైన అంశాలు. తెలుగుదేశం పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తనవంతు కృషి చేయాలనే సంకల్పంతో ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచారు.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో మండల ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ప్రజాజీవితంలో అనుభవాన్ని, స్థానిక సమస్యలపై అవగాహనను ఉపయోగించి ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. తాట్రాజు అప్పారావు నామినేషన్‌కు కూటమి ప్రభుత్వ ముఖ్య నాయకులు జడ్పిటిసి అభ్యర్థి బి ఆర్ బి నాయుడు, నాగవంశం డైరెక్టర్ సూరల సత్యవరప్రసాద్ రావు, కర్రీ శ్రీను, నక్క అప్పలనాయుడు,బూర్ల రమణ, శిర్ల రామనాయుడు, కోరాడ గౌరీ నాయుడు బుగత ప్రకాష్, డోకరరామునారాయణ,కనకల దుర్గారావు,భేరి శ్రీను,బోని గోవింద్,యాగంటి తిరుపతి, కాళ్ళఆదినారాయణ, బోని,శిర్లపాలం, పెకెరు గ్రామ ప్రజలు ఎక్కవ సంఖ్యలో తరలి వచ్చారు. బోని నుండి నామినేషన్ దాఖలు చేయడంతో టీడీపీ నాయకులుల్లో కొత్త జోష్ వచ్చింది.ధీనితో ఆనందపురం మండల పరిషత్ ఎన్నికల సందడి మరింత పెరిగింది.
రిపోర్టర్ : శ్రీనివాస్, ఆనందపురం, విశాఖపట్నం.