తూకివాకం ఎంపీటీసీ అభ్యర్థిగా మునీశ్వరి నామినేషన్
రేణిగుంట మేజర్ న్యూస్ : రేణిగుంట మండలం ఎన్నికల నామినేషన్ మూడో రోజు తూకివాకం సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎంపీటీసీ అభ్యర్థిగా తూకివాకం మాజీ సర్పంచ్ మునిశేఖర్ రెడ్డి సతీమణి సిద్ధప్ప రెడ్డి మునీశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆమె నామినేషన్ సమర్పించారు.