BREAKING
మేయర్ ఎన్నికల బరి నుంచి మాతంగి కృష్ణ ఉపసంహరణ ఎల్ నినో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం.. రైతులు ఆందోళన చెందవద్దు!, మహాదేవపూర్ రైతు వేదిక నుంచి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా, ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కుప్పంలో తెదేపా నాలుగవ వార్డు అభ్యర్థి ప్రచారం 28వ డివిజన్‌లో కూటమి ఆత్మీయ సమావేశం అయ్యప్ప స్వామి నూతన ఉత్సవ విగ్రహ నిర్మాణం పోత బడిలో పిల్లల కష్టాలు - వర్షంలోనే చదువులు బిజెపి కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం.... కూటమి అభ్యర్థులకు అండగా పుర ప్రజలు: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ప్రచార కార్యక్రమంలో అడుగడుగునా వైసిపికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు... భూముల త్యాగం.. అభివృద్ధికి దూరం!, నగరంపల్లి రైతులకు దక్కని ఆశించిన ప్రయోజనాలు, ఓసి -3 తో మారని గ్రామీణ జీవనం పండుగ సాయన్నకు ఘనంగా నివాళులర్పించిన శ్రీనివాస్ రెడ్డి పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు వెల్లటూరు ఎంపీటీసీ సభ్యులుగా ఇరువురు నామినేషన్ జిల్లా కేంద్రంలో వినోదానికి కొత్త శోభ - జిల్లా కలెక్టర్ కె.హరిత సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.. నటుడు మనోజ్ జోషి ఆసక్తికర వ్యాఖ్యలు!

పొదలకూరు నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్

Select Suryaa Now
పొదలకూరు నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్

పొదలకూరు,  మేజర్ న్యూస్ :  పొదలకూరు నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది.స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో వార్తా సేకరణకు వెళ్లిన మీడియా ప్రతినిధులను కేంద్రం వద్దకు అనుమతించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.జిల్లాలో పలుచోట్ల మీడియాకు పాయింట్ ఏర్పాటు చేసి, అక్కడ నుండి కవరేజ్ చేసుకునే విధంగా  వెసులుబాటు కల్పించారు. కానీ పొదలకూరులో ఆ పరిస్ధితి లేదు.ఫలితంగా మీడియా ప్రతినిధులు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు, ఏదైనా సమస్య ఉంటే రిటర్నింగ్ అధికారితో మాట్లాడుకోవాలంటూ దురుసుగా సమాధానమిచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.అదే సమయంలో ప్రజలకు సమాచారాన్ని చేరవేసే మీడియా విధులకు ఆటంకాలు కలగకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది.భద్రతా కారణాలతో ఆంక్షలు విధించినప్పటికీ,వాటి పరిధి ఏమిటి? మీడియా ప్రతినిధులను ఎందుకు అనుమతించడం లేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మీడియా విధులకు ఆటంకాలు కలగకుండా,ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాలని పాత్రికేయులు కోరుతున్నారు.పొదలకూరు నామినేషన్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఈ పరిణామాలపై ఉన్నతాధికారులు స్పందిస్తారా? మీడియా ప్రతినిధులకు స్పష్టత ఇస్తారా? అనేది వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.