పంచాయతీ ఎన్నికలకు 15 నుంచి నామినేషన్ల స్వీకరణ
వింజమూరు, మేజర్ న్యూస్ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల 26 నుండి జరుగునున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ 15వ తేదీ నుండి స్వీకరించనున్నట్లు వింజమూరు మండల పరిషత్ అధికారి కే శ్రీనివాసరెడ్డి తెలిపారు. వింజమూరు మండలంలో ఐదు చోట్ల నామినేషన్ల స్వీకరణ ప్రదేశాలను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు మండలంలోని చాకలికొండ జనార్ధనపురం కాటేపల్లి రావిపాడు చాకలికొండ స్వర్ణ సచివాలయంలో ఊటుకూరు నంది గుంట నందిగుంట స్వర్ణ సచివాలయంలో గుండుమడగల శంఖవరం పంచాయతీలకు సంబంధించి గుండెమడగల స్వర్ణ సచివాలయంలో ఏ కిస్తీపురం బుక్కాపురం పంచాయతీలకు సంబంధించి చంద్ర వడియా కమ్యూనిటీ హాల్ నందు వింజమూరు పంచాయతీ సంబంధించి వింజమూరు పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారని ఆయన తెలిపారు అదే విధంగా ఆరవ తేదీ జరిగిన జడ్పిటిసి పంచాయతీ ఎన్నికలలో విజేతలైన అభ్యర్థులలో ఎంపీపీ గా మండల ఉపాధ్యక్షుడిగా ఈనెల 19వ తేదీన ప్రమాణ స్వీకారం జరుగునున్నట్లు ఆయన తెలిపారు.