BREAKING
పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు భారత్–శ్రీలంక వన్డే టికెట్ల విక్రయానికి ముహూర్తం ఖరారు ఐదుగురు బాధితులకు సహాయం అందించిన మానవత.

పిరాట్లంక గ్రామ అభివృద్ధే లక్ష్యంగా నీలా శేషగిరిరావు (చంటి) ఎన్నికల ప్రచారం కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థన

Select Suryaa Now
పిరాట్లంక గ్రామ అభివృద్ధే లక్ష్యంగా నీలా శేషగిరిరావు (చంటి) ఎన్నికల ప్రచారం  కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థన

రేపల్లె మేజర్ న్యూస్; గ్రామ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా  గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నీలా శేషగిరిరావు (చంటి) ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామంలోని ప్రతి వీధిని అభివృద్ధి చేయడం, మౌలిక వసతులు కల్పించడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం తన ప్రధాన లక్ష్యమని చంటి పేర్కొంటున్నారు. గ్రామ ప్రజలు తనపై నమ్మకంతో కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఆయన హామీ ఇస్తున్నారు. పంట కాలువల వద్ద వంతెనల నిర్మాణం, చర్చి ప్రాంగణానికి ప్రహరీ గోడ నిర్మాణం, గ్రామంలోని అంతర్గత రహదారుల అభివృద్ధి, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తానని చెబుతున్నారు.
అదేవిధంగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, వీధుల్లో సిమెంట్ బెంచీల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యాల మెరుగుదల, పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన, విద్యా వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తానని తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తా
గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడంతో పాటు, ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని చంటి హామీ ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని పేర్కొంటున్నారు.కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను సర్పంచ్‌గా, తన ప్యానల్ వార్డు సభ్యులను గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను కోరుతున్నారు. ప్రజల ఆశీస్సులు, మద్దతుతో  గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన సంకల్పమని నీలా శేషగిరిరావు (చంటి) స్పష్టం చేస్తున్నారు.