పి జి ఆర్ ఎస్ కు 98 అర్జీలు జిల్లా ఎస్పీ పి. జగదీష్
అనంతపురం బ్యూరో
పి జి ఆర్ ఎస్ కు 98 అర్జీలు
జిల్లా ఎస్పీ పి. జగదీష్
ప్రజల నుంచి వచ్చిన పి జి ఆర్ ఎస్ అర్జీలను చట్ట పరిధిలో సమగ్రంగా విచారించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ పి. జగదీష్ అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ఎస్పీ 98 వినతులను స్వీకరించి, బాధితుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. బాధితులకు వేగంగా, పారదర్శకంగా న్యాయం అందించాలని, ముఖ్యంగా కుటుంబ కలహాల ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. నాగభూషణం, మహిళా విభాగం డీఎస్పీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పి జి ఆర్ ఎస్ కు వచ్చిన బాధితులు, వారి సహాయకులకు ఇస్కాన్ సంస్థ సౌజన్యంతో ఉచిత భోజనం ఏర్పాటు చేశారు.