పేదలకు పట్టాభిషేకం కార్యక్రమానికి 20వ డివిజన్ నుంచి తరలిన లబ్ధిదారులు
విజయవాడ/కృష్ణలంక, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున పట్టాల పంపిణీ కార్యక్రమానికి 20వ డివిజన్ నుంచి లబ్ధిదారులు, పార్టీ కార్యకర్తలు తరలివెళ్లారు. గల్లా కామేశ్వరరావు డొంకరోడ్ నుంచి లబ్ధిదారులు, కార్యకర్తలను వారికి కేటాయించిన బస్సుల్లో కార్యక్రమానికి పంపించారు.