పేదలకు ఆర్థిక భరోసా.. ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లు.
రంగన్నగూడెం, అక్టోబర్ 1, మేజర్ న్యూస్.
పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ ఛైర్మన్ ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో గురువారం ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగన్నగూడెంలో 459 మంది లబ్ధిదారులకు రూ.20.41 లక్షల పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బాపులపాడు మండలంలో 11,604 మందికి రూ.4.99 కోట్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ ప్రధాన కార్యదర్శి మైనేని శ్రీనివాసరావు, బీఎల్‌ఏ కసుకుర్తి వేణుబాబు, పంచాయతీ కార్యదర్శి పి. కృష్ణకాంత్, వెల్ఫేర్ అసిస్టెంట్ జె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.