BREAKING
పాల ఉత్పత్తిలో గ్రామీణ మహిళలే కీలకం -సీడీటీలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం -ఉత్తమ మహిళా పాడి రైతుగా టి.విద్యకు సత్కారం రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పేదల సేవలో.. ఎన్టీఆర్ భరోసా

Select Suryaa Now
పేదల సేవలో.. ఎన్టీఆర్ భరోసా

పేదల సేవలో.. ఎన్టీఆర్ భరోసా

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 1, మేజర్ న్యూస్ : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉదయం 6 గంటల నుంచే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు.

ఏపీ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జోన్-3 ఇన్‌చార్జి రెంటపల్లి శ్యామ్ గ్రామ సచివాలయ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల చూపుతున్న నిబద్ధతను వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం కోసం 76 ఏళ్ల వయసులోనూ నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తమ ఆశీస్సులు అందించాలని రెంటపల్లి శ్యామ్ కోరారు.